Singireddy Niranjan Reddy Interview | రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీతో ఏం తేలుస్తారు | ABP Dsam

Discription: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ వేసింది. అధ్యయన కమిటీ చైర్మన్ గా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డినీ నియమించింది. ఈ కమిటీలో పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తొలిసారిగా ఈ కమిటీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. అయితే కమిటీకి రైతుల నుండి ఎలాంటి సమస్యలు తెలిసొచ్చాయి..? అదిలాబాద్ జిల్లాలో ఉన్న రైతులు కమిటీకి ఏం చెప్పారు..? రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని కమిటీ సభ్యులు సందర్శించారు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఏమన్నారు..? ఈ కమిటీ రాష్ట్రంలో ఎన్ని రోజులపాటు పర్యటించనుంది..? స్థానిక సంస్థల ఎన్నికలె లక్ష్యంగా ఈ కమిటీ పర్యటిస్తుందని పలువురు వాపోతున్నారు దీనిపై మీరేమంటారు..? మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు.. ఎప్పుడు బయటకు వస్తారని ప్రజలు అంటున్నారు దీనిపై మీరేమంటారు..?  ఈ అంశాలపై మాజీ మంత్రి, రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో abp దేశం ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola