Singer Gaddar Passes Away: అనారోగ్యంతో కన్నుమూసిన గద్దర్ , ధ్రువీకరించిన కుమారుడు

ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. 1949లో తూప్రాన్ లో గద్దర్ జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పించడంలో గద్దర్ ఎంతో కీలకపాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చిన ఘనత గద్దర్ దే. 1987లో కారంచేడులో దళితుల హత్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఫేక్ ఎన్ కౌంటర్లపై గద్దర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 1997 ఏప్రిల్ లో గద్దర్ పై హత్యాయత్నం కూడా జరిగింది. 2010లో తెలంగాణ ఉద్యమంలో చేరకముందు గద్దర్... నక్సలైట్ గా ఉండేవారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 74 ఏళ్ల వయసులో అనారోగ్యానికి చికిత్స పొందుతూ గద్దర్ కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు సూర్యం ధ్రువీకరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola