Sigachi Chemical Explosion | పాశమైలారంలో రియాక్టర్ పేలిన వెంటనే లోపల ఏం జరిగిందంటే..!? | ABP Desam
సంగారెడ్డి సమీపంలోని పాశమైలారం సెగాచీ కెమికల్ ఫ్యాక్టరీఘోర అగ్నిప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత పటాన్‌చెరులోని పాశమైలారం ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుంతో తెలియక అల్లాడిపోయారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది వచ్చి పరిశ్రమలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 34 మంది కాలిన గాయాలతో మియాపూర్, చందానగర్, పటాన్ చెరు లలో వివిధ ప్రవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో భయానక పరిస్దితులను కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు బాధితులు. ప్రాణాలకు తెగించి బయటకు దూకేస్తే ,కాళ్లు చేతులు కాలి ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. కొందరు బయటకు రాలేక ,మంటల్లోనే సజీవ దహనమైయ్యారు. రియాక్టర్ ఎందుకు పేలింది. కారణాలేంటి, పేలిన సమయంలో ఏం జరిగిందనే విషయాలు ABP దేశంతో మాట్లడుతూ బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే వారి మాటల్లోనే..!?