Sigachi Chemical Blast | నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి..!? | దాసరి సునీల్ కుమార్ తల్లిదండ్రుల ఆవేదన

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో చోటుచేసుకున్న ఘోర రసాయన పేలుడు ప్రమాదం అనేక కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. సిగాచీ కెమికల్స్ ఫ్యాక్టరీలో సంభవించిన ఈ విషాద ఘటనలో మొత్తం 36మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. తక్కువ జీతానికి పొట్టను పోషించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారంతా ఒక్కసారిగా తమ ప్రాణాలను కోల్పోవడం.. వారిని కోల్పోయిన కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది.

ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తుండగా, మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తోంది. అయితే మృతుల కుటుంబసభ్యులు ఎదుర్కొంటున్న మానసిక వేదన వర్ణనాతీతం. “నా కుమారుడిని కోల్పోయాను.. మా కోసం ఇంక ఎవరున్నారు అంటూ కన్నీళ్లతో వాపోతున్న ఆ తండ్రి మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపచేశాయి. బతుకుదెరువు కోసం వెళ్లిన వారి శవాలే ఇంటికి తిరిగివచ్చిన దృశ్యం గుండెను పిండేస్తోంది. దాసరి సునీల్ తల్లితండ్రులతో ఏబీపీ దేశం మాట్లాడితే వాళ్లు చెప్పిన మాటలు ఇవి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola