Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వకముందే తెలుగు రాష్ట్రాల్లో  ట్రెండింగ్ బ్రిడ్జిగా వార్తల్లో నిలిచింది. ఓసారి ఈ విజువల్స్ చూడింది. ఒళ్లు గగుర్పొడిచేలా ,  అత్యంత ప్రమాదకరంగా సాగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు, సేఫ్టీ లేకుండా బ్రిడ్జ్ పై కార్మికులు చేస్తున్న విన్యాసాలు, అత్యంత బరువైన గిడ్డర్లును బ్రిడ్జ్ పై తీసుకెళ్తున్న వీడియోలు పెను దుమారం రేపాయి. కార్మికుల ప్రాణాలతోపాటు తేడా వస్తే బ్రిడ్జి క్రింద ప్రయాణిస్తున్న వాహనదారులు తలలు  కూడా పుచ్చకాయల్లా పగిలేలా ఉన్నాయంటూ మీడియా కథనాలు వైరల్ అయ్యాయి. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై తీవ్ర విమర్శలు చేసారు. సీన్ కట్ చేస్తే ఇప్పుుడు ఇదీ తాజా పరిస్దితి. ఎక్కడి పనులు అక్కడే గప్ చిప్.రాత్రి వేళల్లో ఎవరి కంట పడకుండా పనులు చేద్దామని ఫిక్స్ అయ్యారట.

ఇంతలా వార్తల్లో చక్కర్లు కొట్టిన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి, ఇక్కడ స్దానికులకు మాత్రం దశాబ్దాల నాటి కల. సంతోష్ నగర్ టూ సైదాబాద్ మీదుగా చంచల్ గూడ వెళ్లాలంటే కేవలం 3కిలోమీటర్ల దూరం 30 నుండి 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అంతలా ట్రాఫిక్ లో పట్టపగలే చుక్కలు చూసేవారు ఇక్కడ వాహనదారులు. ఈ  స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే కేవలం ఐదే ఐదు నిమిషాల్లో రివ్వుమంటూ దూసుకుపోవచ్చంటున్నారు స్దానికులు..

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola