Riyaz encounter news Nizamabad | నిజామాబాద్ లో ఎన్ కౌంటర్..రౌడీ షీటర్ రియాజ్ మృతి | ABP Desam

Continues below advertisement

  నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిజామాబాద్ జీజీహెచ్ లో చికిత్సపొందుతున్న రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ను లాక్కునే కాల్చేందుకు ప్రయత్నించగా..పోలీసులు ఆసుపత్రి సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం ఉన్నందును రియాజ్ ను కాల్చి చంపినట్లు ప్రకటించారు. రియాజ్ మృతిని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ ఈనెల 17న తనను అదుపులోకి తీసుకున్న సీసీఎఫ్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి చంపేశాడు. హత్య తర్వాత పరారైన రియాజ్ కోసం పోలీసులు గాలించారు. నిందితుడిని పట్టిస్తే 50వేలు ఇస్తామంటూ రివార్డు ప్రకటించారు.  అయితే రియాజ్ ఊరి చివర ఓ యాక్సిడెంట్ అయిన లారీలో తల దాచుకున్నట్లు గుర్తించిన కొంత మంది యువకులు  పోలీసులకు సమాచారం ఇవ్వగా నిన్న అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు యత్నించిన రియాజ్ ను పోలీసులు పట్టుకుని పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు మళ్లీ రియాజ్ కానిస్టేబుల్ గన్ ను లాక్కుని బెదిరించేందుకు యత్నించగా...పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రియాజ్ ను కాల్పి చంపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola