Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ ప్రసవం. అభినందించిన మంత్రి పువ్వాడ
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన అదనపు కలెక్టర్ స్నేహలతను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా, శిశు కేంద్రంలో స్నేహలత ఆడబిడ్డకు జన్మనిచ్చారు. స్నేహలత భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. ఈ దంపతులను ఆసుపత్రిలో కలిసిన మంత్రి పువ్వాడ అజయ్.. వారికి అభినందనలు తెలిపారు. పాపను కాసేపు ఎత్తుకున్నారు. పేదల గుడులు అయిన ప్రభుత్వ ఆసుపత్రులను కేసీఆర్ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు.