Private Travels Bus Fire at Kanchikacherla | కంచికర్ల దగ్గర తగలబడిన ప్రైవేట్ బస్సు | ABP Desam

 ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల దగ్గర రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడిపోయింది. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామ శివారులోని ఇన్వెంటర్ కెమికల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో వరుణ్ ట్రావెల్స్ కి చెందిన ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు లో ఉదయం ఐదున్నరగంటల సమయంలో పొగలు రావటం గమనించిన క్లీనర్..డ్రైవర్ ను అప్రమత్తం చేయగా రోడ్ పక్కనే డ్రైవర్ బస్సు ఆపేసి..ప్రయాణికులను కిందకు దింపేశారు. లగేజీ తో సహా ప్రయాణికులంతా సురక్షితంగా కిందకు దిగి పోగా...డ్రైవర్ కంచికచర్ల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. అయితే ఫైర్ సిబ్బంది వచ్చేప్పటికి బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఏసీ షార్ట్ సర్క్యూట్ కావటమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు అందించిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola