Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

 కబ్జాదారుల చెర నుంచి వెంకటేశ్వరస్వామి గుడిని కాపాడాలని ఈ పూజారి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకోవటం అందరి మనసులను కలిచివేసింది. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సర్వే నం.348/1 లోని ఉన్న  వేంకటేశ్వర స్వామి దేవాలయానికి 25ఎకరాల దేవదాయశాఖ భూమి ఉంది. అయితే అక్కడే ఉన్న పరికి చెరువు ఆనుకుని ఇటీవల కాలంలో పెరిగిపోతున్న నిర్మాణాలతో పాటు కొంతమంది వ్యక్తులు వేదపాఠశాల, పుష్కరిణి నిర్మించుకోవటానికి సిద్ధంగా ఉన్న గుడి భూములను కూడా ఆక్రమించుకుంటున్నారంటూ ఆలయపూజారులు ఓ సెల్ఫీ వీడియోను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పంపారు. దీంతో ఆయనే స్వయంగా గుడికి రాగా...ఇదిగో ఇలా గుడి అర్చకులు స్వామి వారి మాలను హైడ్రా కమిషనర్ కు అందించి కాళ్లకు నమస్కరించాడు. దీంతో షాకైన రంగనాథ్ కబ్జాదారులను వదిలిపెట్టనని..త్వరలోనే పోలీస్ స్టేషన్ కూడా తెరుస్తున్నామని..ఆక్రమణలన్నీ కూలగొడతామని అర్చకులకు హామీ ఇచ్చారు. ఏ పార్టీ వాళ్లను ఉపేక్షించి లేదని తెలిపారు హైడ్రా కమిషనర్. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola