Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

మీరు చూస్తున్న ఈ సీసీటీవీ ఫుటేజ్ ను హైదరబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు. సంధ్యాథియేటర్ లో పుష్ప ప్రీమియర్స్ జరుగుతున్న రోజు అర్థరాత్రి 12గంటల సమయంలో అల్లు అర్జున్ ను హాలు నుంచి బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను ఈ సీసీ టీవీ ఫుటేజ్ లో స్పష్టంగా చూడొచ్చు. అయితే అల్లు అర్జున్ నిన్న ప్రెస్మీట్ లో మాత్రం తన దగ్గరకు ఏ పోలీసులు రాలేదని..సినిమా మొదలైన కొంత సేపటికి వెళ్లిపోయానని చెప్పారు. కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేసిన పోలీసులు సినిమా 9.45 కు మొదలైతే దాదాపుగా 2గంటల పాటు అల్లు అర్జున్ థియేటర్లోనే కూర్చుని సినిమా చూశారని...బయట మనషులు చనిపోయారని చెప్పినా సినిమా చూస్తాననే అలాగే చూశారంటూ చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ లతో మాట్లాడించిన తర్వాత పోలీస్ కమిషనర్ ఈ సీసీ టీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola