Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desam
మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైంది.అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని, తన ఫోన్ ట్యాప్ చేసి వేధింపులకు గురిచేశారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు హరీశ్ రావుపై కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపైనా కేసు పెట్టారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇన్ని రోజులూ కేటీఆర్ చుట్టూ వివాదం నడవగా..ఇప్పుడు ఈ కేసులోకి హరీశ్ పేరు కూడా రావటం సంచనలంగా మారింది. బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందని తమనేం చేయలేరని కేటీఆర్ గతంలోనే సవాల్ విసిరారు. ఇప్పుడు హరీశ్ రావుపైనా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదటవటంతో ఈ వివాదం మరింత రాజుకునే అవకాశం ఉంది. పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా తను ప్రభుత్వాన్ని నిలదీయటం మాననని ట్వీట్ చేశారు హరీశ్ రావు.