Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు

Continues below advertisement

హైదరాబాద్‌లోని ఫిర్జాదిగూడ శంకర్ నగర్ కాలనీ రోడ్డు నంబర్ 3లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో ఒక యువతి పూర్తిగా నగ్నంగా వచ్చి వరుసగా ఇళ్ల తలుపులు తడుడుతూ తిరిగిన దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ భయంకరమైన మరియు వింతైన ఘటనతో చీకటి పడగానే కాలనీవాసులు ఇళ్ల తలుపులు గడియ పెట్టుకుంటున్నారు. ఒంటరిగా బయటకు రావడానికి గజగజ వణుకుతున్న పరిస్థితి నెలకొంది.

మృతురాలు తేజస్విని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఇలా ప్రవర్తించిందా లేక దీని వెనుక ఏదైనా క్షుద్రపూజల ప్రభావం ఉందా అన్న అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె ఎలా చనిపోయింది, ఇది హత్య లేక ఆత్మహత్యా అనే మిస్టరీ స్థానికులకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ సమయంలో అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాలు ఎవరికీ అర్థం కావడం లేదు.

స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ నగ్న ప్రవర్తన మరియు మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిజానిజాలు తేల్చేందుకు లోతైన దర్యాప్తు వేగవంతం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola