Pastor Ajay Babu Sensational Interview | యేసును తిడుతున్నారు..అందుకే హిందువులపై మాట్లాడుతున్నాం |ABP
యేసు క్రీస్తును కొందరు మతోన్మాదులు దూషించడం వల్లే తాము హైందవ్యంపై విమర్శలు చేయాల్సి వస్తుందని పాస్టర్ అజయ్ బాబు అన్నారు. రాధా మనోహర్ దాస్ అసలు చరిత్ర ఏంటని, ఆయన యేసు క్రీస్తును దూషిస్తే తాము చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. తాను హిందువేనని, తనకు ఉన్న అనారోగ్యాన్ని యేసు క్రీస్తు స్వస్థపరచడం వల్లే క్రైస్తవుడైనట్లు తెలిపారు. భారత దేశంలో మిషనరీలు చూపిన సేవా భావం నేటి క్రైస్తవ్యంలో లోపించిందన్నారు. క్రైస్తవులు ఇచ్చే దశమ భాగాలను కొద్ది మంది పాస్టర్ల అక్కౌంట్లలోకి వెళుతున్నాయే తప్ప పేదలకు అందడం లేదని వాపోయారు. హిందు దేవాలయాలను ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకున్నట్లే చర్చిలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని పాస్టర్ ఏబీపీ దేశం ఇంటర్వూ లో సూచించారు. కొద్ది మంది హైందవ విమర్శలు, క్రైస్తవ్యంలోని లోపాలపై, చేపట్టాల్సిన సంస్కరణల పై ఆయన ఏబీపీ దేశం ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక మైన ఇంటర్వూలో మాట్లాడారు.