Palla Rajeshwar Reddy at KCR Farmhouse | కాలు జారిపడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారు. బాత్రూంలో కాలుజారి పడడంతో ఆయన తుంటి ఎముకకు గాయం అయినట్టుగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తరలించారు. కాళేశ్వరం కమిషన్ ముందు నేడు కేసీఆర్ విచారణకు హాజరు కానుండంతో.. గతరాత్రి రాజేశ్వర్ రెడ్డి ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లారు. రాత్రి ఫాంహౌస్‌లోనే ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నుండే BRK భవన్ కి వెళ్లనుండడంతో BRS పార్టీ నాయకులూ, కార్యకర్తలు కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ కాన్వాయ్ బయల్దేరినప్పటి నుంచి దారి పొడవున కార్యకర్తలు కార్లు, టూవిలర్స్‌లో ఫాలో అయ్యారు.అయితే ఈ విచారణ గదిలోకి 9 మంది నేతలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు.

ఫామ్‌హౌస్ నుంచి విచారణకు బయల్దేరిన కేసీఆర్‌కు పూలు జల్లి సాగనంపారు బీఆర్‌ఎస్ శ్రేణులు. ఆయన కాన్వాయ్ బయల్దేరినప్పటి నుంచి దారి పొడవున కొందరు కార్యకర్తలు కార్లు, టూవిలర్స్‌లో ఫాలో అయ్యారు. 

ముందుగా ఇంట్లో నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్ అనంతరం విచారణకు బయల్దేరారు. కాసేపట్లో బీఆర్‌ఎక్కే భవన్‌కు చేరుకొని అక్కడ జరిగే విచారణకు హాజరవుతారు. ఈ విచారణ గదిలోకి 9 మంది నేతలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. హరీష్‌ రావు, కేవిత, ప్రశాంత్ రెడ్డి కూడా విచారణ టైంలో ఉంటారని తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola