Attack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam

 అల్లు అర్జున్ ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  రేవతి చనిపోవటానికి అల్లు అర్జునే కారణమంటూ బన్నీ ఇంటిపైన ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాల నేతలు దాడికి దిగారు. కొంత మంది విద్యార్థి నాయకులు అల్లు అర్జున్ ఇంటి గోడ ఎక్కి అక్కడ నుంచి ఇంటికి పైకి రాళ్లు విసిరారు. మరి కొంత మంది గోడ దూకి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా...అల్లు అర్జున్ సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి నేతలు అక్కడున్న పూల కుండీలను పగులగొట్టారు. అల్లు అర్జున్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈలోగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసిన తరలించారు. ఘటనపై అల్లు అర్జున్ తండ్రి రియాక్ట్ అయ్యారు. అభిమానులు సంయమనం పాటించాలని అందరూ శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. అల్లు అరవింద్ తమకు తమ ఇంటికి పోలీసు భద్రత ఉందని తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola