Old Coins Collector From Adilabad | పూర్వకాలపు నాణేలు సేకరిస్తున్న ఆదిలాబాద్ వాసి..|

Continues below advertisement

Old Coins Collector From Adilabad | 

ప్రస్తుతం యూపీఐ యుగంలో పది రూపాయల నోటు చూడటం కూడా కష్టంగా మారింది కదా..! ఈ కాలం పిల్లలకు ఐతే రూపాయి ఎలా ఉంటుదో కూడా సరిగ్గా తెలీదు.  కానీ.. ఈ పెద్దాయన వద్ద మహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణేలు కూడా ఉన్నాయి.  ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాన్ప మేడిగూడకు చెందిన ఈయన పేరు..! క్షిరాసాగర్ పరుశురాం..!  ఈ నాణేలు సేకరించే అలవాటు చిన్నప్పటి నుంచే వచ్చింది.  11వ శతాబ్దంలో బంగారంతో తయారు చేసిన నాణేల నుంచి.. ప్రస్తుతం చలామణిలో ఉన్న 2వేల నోటు వరకు అన్ని రకాల కరెన్సీలను ఈయన భద్రపరుస్తున్నారు. వీటన్నింటిని అనేక చోట్ల ప్రదర్శిస్తున్నారు. అలా.. పంద్రాగస్టు సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పరేడ్ గ్రౌండ్స్ లో ప్రదర్శనకు ఉంచారు. ఇవి చూసినవారంతా ఆయన సంకల్పాన్ని మెచ్చుకుంటున్నారు. రేపటి తరం కోసం నాణేలు భద్రపరుస్తున్న ఈ వ్యక్తి ఫుల్ స్టోరీ ఈ వీడియోలో చూసేయండి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram