మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తం

హైదరాబాద్‌ తరవాత అతి పెద్ద నగరం వరంగల్. ఎడ్యుకేషన్ హబ్‌గానూ పేరుంది. అందుకే...ఇక్కడ ఐటీ సెక్టార్ చాలా స్పీడ్‌గా ఎక్స్‌పాండ్ అవుతుందని అందరూ ఊహించారు. కానీ వాస్తవంగా చూస్తే మాత్రం ఇక్కడ ఐటీ రంగం అంతంతమాత్రంగానే ఉంది. కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వచ్చిన కొన్ని కంపెనీలకు బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వలేక పోతున్నాయి ప్రభుత్వాలు. ఈ కారణంగానే కొన్ని సంస్థలు మూతపడే దశకు వచ్చేశాయి. 

వరంగల్ నగర శివారు ప్రాంతంలో మడికొండ ఐటీ హబ్ ఏర్పాటై పదేళ్లు దాటింది. కానీ ఇప్పటికీ ఎలాంటి డెవలప్‌మెంట్ కనిపించడం లేదు. 2014లో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐటీ హబ్ కోసం 40 ఎకరాల భూమిని కేటాయించింది. 2016 నుంచి స్టార్టప్‌లు  ఏర్పాటయ్యాయి. ఈలోగా బడా కంపెనీలు వచ్చేస్తున్నాయని చెప్పి ఉన్న స్టార్టప్‌లనూ ఖాళీ చేయించారు. సియెంట్, ఆ తరవాత టెక్‌మహీంద్ర, జెన్‌పాక్ట్‌ క్యూ కట్టాయి. అయినా ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు రాలేదు. వీటిలో టెక్‌మహీంద్ర సంస్థ వరంగల్‌ ఆఫీస్‌ని పూర్తిగా మూసేసింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola