Revanth Reddy: ఆగస్టు 18న ఇబ్రహింపట్నంలో దళిత దండోరా.... ఇంద్రవెల్లిలో ప్రకటించిన పీసీసీ చీఫ్ రేవంత్
ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలో మరో దళిత దండోరా సభ పెట్టబోతున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా జరిగిన దళిత, గిరిజన దండోరా సభలోనే ఈ విషయాన్ని ప్రకటించారు. కార్యకర్తలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని... ఈ సభ నాయకుల విజయం కాదని... కార్యకర్తల కమిట్‌మెంట్ అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.