BJP vs TRS Kamareddy District : నిజాంసాగర్ మండల కేంద్రంలో జెండా కోసం కొట్లాట | ABP Desam
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో పార్టీ జెండా కోసం బీజేపీ, టీఆర్ఎస్ ఘర్షణకు దిగాయి. బీజేపీ జెండా గద్దెను ఏర్పాటు చేసుకుంటే టీఆర్ఎస్ నాయకులు జెండాను తొలగించారని బీజేపీ ఆరోపించింది. ఆ తర్వాత బీజేపీ నాయకులు గద్దె పై తిరిగి కాషాయ జెండాను ఎగురేసేందుకు ప్రయత్నించటంతో ఇరు వర్గాలు మరో సారి ఘర్షణకు దిగాయి. బీజేపీ నాయకులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనను కొనసాగించారు. ఆతర్వాత టీఆర్ఎస్ నాయకులకు పోలీసులు సర్ది చెప్పగా...బీజేపీ నాయకులు తమ పార్టీ జెండాను ఎగురవేశారు