Nirmala Sitharaman Anger on Collector : రేషన్ లో కేంద్రం వాటా ఎంత..కలెక్టర్ కు ప్రశ్న | ABP Desam
కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా బీర్కూర్ రేషన్ షాపులను కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించారు. అక్కడ దుకాణాల్లో లబ్దిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చౌకధరల దుకాణాల్లో సీఎం కేసీఆర్ ఫోటోలు మాత్రమే ఉండటం గమనించిన నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీ ఫోటోలు ఎందుకు లేవని కలెక్టర్ ను ప్రశ్నించారు.