Nagunur 400 Kakatiya Temples History | కాకతీయుల రాజుల ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నంగా నగునూరు గ్రామం | ABP Desam
చూడటానికి పురాతన కాల కట్టడంలా...ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చేసిన ఈ గుడులను చూశారు కదా..ఇవి కాకతీయుల కళావైభవానికి, ఆధ్యాత్మిక చింతనకు గుర్తుగా ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. సాధారంగా కాకతీయులు అంటే వరంగల్ గుర్తొస్తుంది కానీ కరీంనగర్ జిల్లాకు సమీప ప్రాంతమైన ఈ నగునూరు గ్రామం కాకతీయుల దైవిక ప్రార్థనలకు ఆధ్యాత్మిక స్థలిగా ఉండేది. ఎందుకంటే ఈ ఊర్లో ఒకటి కాదు రెండు 400 దేవాలయాలను కాకతీయులు నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.ఈ నగునూర్ గ్రామాన్ని నన్నూరు అని పిలిచేవారు. నాలుగునూర్ల ఆలయాలు ఉండటం కారణంగానే ఈ పేరు ఈ పల్లెకు వచ్చిందని అంటారు. అప్పట్లో కాకతీయ రాజులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఆలయాలను నిర్మించి ఉత్సవాలను కూడా నిర్వహించేవారట. కానీ కాలక్రమేణా అవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి.దక్షిణభారతదేశంలో రెండో త్రికూటాలయంగా ఇక్కడి శివాలయం ఉండేదని...వేములవాడ రాజన్న సైతం ఇక్కడే కొన్నాళ్లు ఉన్నారని చెబుతారు. వందల సంవత్సరాల ముందే పరాయి పాలకుల దాడుల్లో ఈ ఆలయాలు నేల మట్టం అవుతూ వచ్చాయి. నాలుగు వందలకు గుడులకు ఇప్పుడు నాలుగు గుడులు మాత్రం ఇప్పటికీ ఇదిగో పురాతన శివాలయాలుగా నేటికీ భక్తుల పూజలను అందుకుంటున్నాయి.