Nagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP Desam

Continues below advertisement

  సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఆదివాసీలు. తమ జీవనశైలిలో ఉండే విధానాన్ని బట్టి వారి సాంప్రదాయ పూజల్లో వినియోగించే డోలు, తుడుం, కాళికొమ్, సాన్నాయిలు, ఒక్కో సందర్భానికి ఒక్కో రకమైన రీతిలో వాయించడం జరుగుతుంది. పూర్వం పెద్దలు నేర్చుకోని వాయించే విధానం తరతరాలుగా కొనసాగుతా వస్తుంది. ఇదివరకు వాయించినవారు వృద్ధులు కావడంతో కొత్త తరం యువకులు సైతం ముందుకొచ్చి డోలు, తుడుం, సన్నాయి, కాళికొమ్,  వాయించడం నేర్చుకున్నారు. కేస్లాపూర్ నాగోబా జాతరలో మెస్రం వంశీయుల పూజల్లో న్యూ జనరేషన్ ఇప్పటి నవ యువతరం డోలు సన్నాయిలను వాయిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి నవతరానికి విరే ముందుచూపు.. ఇంతకీ ఈ ఆదివాసి నవ యువకులు  సాంప్రదాయ డోలు వాయిద్యాలను ఏ విధంగా నేర్చుకున్నారు..? అసలు ఈ వాయిద్యాలను నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది..? ఆదివాసీల వాయిద్యాల్లో ఎన్ని రకాలైన వాయిద్యాలుంటాయి..?  వాటిని ఎప్పుడేప్పుడు ఏయే సందర్భాల్లో వాయిస్తుంటారు..? ఈ అంశాలపై డోలు సన్నాయి వాయించే ఆదివాసి నవ యువకులతో abp దేశం చిట్ చాట్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola