Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువైన ఆదిశేషుడికి పుష్య అమావాస్య సందర్భంగా మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ చేయనున్నారు. పవిత్ర గంగాజలంతో మర్రి చెట్ల నీడలో నాలుగు రోజుల పాటు సాంప్రదాయ పూజ కార్యక్రమాలు నిర్వహించిన మెస్రం వంశీయులు. 18వ తేదీన ఉదయం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ సాంప్రదాయ రీతిలో ఆడపడుచులకు కుండలను అందజేశారు పెద్దలు. ఆపై కోనేరు వద్దకు చేరుకొని పూజలు చేసి నీటిని తీసుకొచ్చి పుట్టను తయారు చేసి బౌల లాగా ఉండలను చేసి సత్తీక్ దేవుని ముందు ఏడు అడుగులు పెట్టీ మొక్కుకున్నారు. అనంతరం తమ సాంప్రదాయ రీతిలో డోలు వాయుద్యాల నడుమ గోవాడకు చేరుకున్నారు. నాగోబా మహాపూజకు ముందు సాంప్రదాయ రీతిలో మెస్రం వంశీయులు నిర్వహించే ఈ ఆచార సాంప్రదాయ కార్యక్రమాలను మెస్రం వంశీయులు ఏ విధంగా నిర్వహిస్తారు..? వాటి ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో చూద్దాం.