Mysterious bone theft | Peddapally : శ్మశానంలో ఎముకలు ఎత్తుకెళ్తున్న మహిళలు... పెద్దపల్లిలో కలకలం
అంత్యక్రియల తర్వాత అస్థికలు తీసుకెళ్లి పవిత్ర నదుల్లో కలిపితే, మరణించిన వారు పుణ్యలోకాలకు వెళ్తారనే నమ్మకం హిందూ సంప్రదాయంలో ఎప్పటినుంచో ఉంది. కానీ పెద్దపల్లి జిల్లాలో ఈ విశ్వాసాన్నే దెబ్బతీసేలా దొంగతనాలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడి శ్మశానంలో శవాలను కాల్చిన తర్వాత కొందరు ఎముకలను ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇంతకీ ఎముకల దొంగతనాలెందుకు జరుగుతున్నాయి? దీని వెనక ఏమైన క్షుద్రపూజల కుట్ర దాగి ఉందా? ఏబీపీ దేశం అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది.