My Farm Premium Milk Launch | Godrej Jersey నుంచి 'మై ఫామ్' పేరుతో ప్రీమియం పాలు

Continues below advertisement

గోద్రెజ్ అగ్రోవెర్ట్ లిమిటెడ్ లో భాగమైన క్రీమ్ లైన్ డైరీ ప్రొడెక్ట్ మై ఫామ్ పేరుతో నాణ్యమైన, తాజా పాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ లో నిర్వహించిన మై ఫామ్ లాంఛింగ్ ఈవెంట్ లో గోద్రెజ్ జెర్సీ సీఈవో భూపేంద్ర సూరి తమ కంపెనీ ప్రతినిధులతో కలిసి మై ఫామ్ ప్రీమియం పాల ప్యాకెట్లను విడుదల చేశారు. హైదరాబాద్ వాసుల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తున్న మై ఫామ్ ఆవు పాలను అరలీటరు ప్యాకెట్ యాభై రూపాయలకే అందిస్తోంది గోద్రెజ్ జెర్సీ సంస్థ. ప్రిజర్వేటివ్, యాంటిబయాటిక్స్, హార్మోన్స్ వినియోగించకుండా వందశాతం స్వఛ్చమైన నాణ్యతతో ప్యాకేజింగ్ పూర్తైన ఈ ఆవు పాలు నేరుగా డైరీ టూ డోర్ స్టెప్ ఆఫ్ కన్జ్యూమర్స్ అనే కాన్సెప్ట్ తో తీసుకువచ్చారు. అంతే కాదు ఆవుల నుంచి పాలను తీయటం, చిల్లింగ్, పాశ్చరైజేషన్, ప్యాకేజింగ్ ఈ మొత్తం ప్రాసెస్ లో మనుషుల చేతులు పాలను తాకకుండా జీరో హ్యూమన్ టచ్ అనే కాన్సెప్ట్ ను కూడా ఇందులో ఇన్ క్లుడ్ చేసింది గోద్రెజ్ జెర్సీ సంస్థ. అసలు గోద్రెజ్ జెర్సీ నుంచి మై ఫామ్ అనే ఈ ప్రీమియం పాలను ఎందుకు తీసుకువస్తున్నారు. కంపెనీ ప్రతినిధుల ఆలోచనలు ఏంటీ..వినియోగదారులకు ఇవి ఏ మేరకు ఉపయోగపడనున్నాయి..వీటిని ఎలా కొనుక్కోవాలి..లాంటి విషయాలను గోద్రెజ్ జెర్సీ సీఈవో భూపేంద్ర సూరితో మాట్లాడి తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram