Mukarram Jah Final Rites : ఎనిమిదో నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు పూర్తి | DNN | ABP Desam
ఎనిమిదో నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎనిమిదో నిజాం కు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. నిజాం కుటుంబీకుల రాజ లాంఛనాలు పూర్తైన తర్వాత అంతిమయాత్ర మొదలైంది. పాత బస్తీ వీధుల్లో ముకర్రం ఝా పార్థివదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మక్కా మసీదు ప్రాంగణంలో తన తండ్రి సమాధి పక్కనే ఎనిమిదో నిజాం ఖననం చేశారు.