Mother Left Her Baby in BUS Stand For Insta Lover | ప్రియుడి కోసం బస్టాండ్‌లో బిడ్డను వదిలేసిన తల్లి | ABP Desam

   ఇన్ స్టా గ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం పసి పిల్లాడిని బస్టాండ్ లో వదిలేసిన ఓ తల్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నల్లగొండ బస్టాండ్‌లో జరిగింది ఈ దారుణం. ఇన్‌స్టాగ్రామ్‌ లో పరిచయమైన తన ప్రియుడి కోసం వెళ్లిపోవాలని డిసైడ్ అయిన ఆ తల్లి తన కన్న బిడ్డను ఇలా బస్టాండ్ కి తీసుకువచ్చి వదిలేసి తనకేం పట్టన్నట్లుగా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఆ పసిపిల్లాడి ఏడుపులు విన్న ఓ యువకుడు బస్టాండ్ సిబ్బందికి ఆ పిల్లాడిని అప్పగించగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించిన అధికారులకు ఈ దారుణం కళ్లబడింది. సీసీటీవీ ఫుటేజ్ లో తన తల్లి కనిపించగానే ఆ పిల్లాడు మమ్మీ అంటూ ఏడవటం అధికారులను అందరినీ కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రియుడి బండి నెంబర్ ఆధారంగా తల్లిని, ఆమె భర్తను, ప్రియుడిని ముగ్గురుని స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లాడిని కన్నతండ్రికి అప్పగించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola