Bridge Collapse: ఎంత నిర్లక్ష్యం.. మూడోసారి కుప్పకూలిన బ్రిడ్జి
ప్రజా ప్రతినిధుల చేతగానితనమో.. పాలకుల నిర్లక్ష్యమో గానీ ప్రజాధనం వృథా అవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మూలవాగు బ్రిడ్జి ముచ్చటగా మూడోసారి నిర్మాణదశలోనే కూలిపోయింది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహానికి బ్రిడ్జి సపోర్టు కూలిపోయాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నిధులు వృథా అవుతున్నాయని.. బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందా లేదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags :
Telangana Telangana Rains Rajanna Sircilla Moolavagu Bridge Vemulawada Moolavagu Bridge Collapse