
MLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam
Discription: ఆదిలాబాద్ జిల్లాలో పట్టపదుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత సైతం పోటీకి రెడీ అంటూ పోటీలో నిలబడి ప్రచారం చేస్తున్నాడు ఆదిలాబాద్ జిల్లాకీ చెందిన ఓ గిరిజన యువకుడు. మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నత చదువులు చదివి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఆయన...ఎప్పటికీ వయసస్సు గల వారే ఎక్కువగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.. మారుతున్న కాలానికనుగునంగా ఏ ఎన్నికైన ఇకపై యువత పోటీలో ఉండాలి అంటూ యువతే ఇకపై ముందుండి ప్రజాసేవ చేసేందుకు ముందుకు రావాలనీ, ఏ పార్టీలు తమకు టిక్కెట్లు ఇవ్వకున్నా స్వతంత్రంగానే పోటీలో దిగి యువత సత్తా ఏంటో చూపించాలంటున్నాడు. పోటీలో ఉన్న తన క్రమసంఖ్య 15 రావడంతో...తమ ఆరాధ్యదైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా 15వ తేదీన రోజున.. తన అదృష్ట సంఖ్య అంటూ తాను పుట్టి పెరిగిన ప్రాంతం నుండి ప్రచారం ప్రారంభించాడు. ఇంతకీ ఎవరా ఆదిలాబాద్ గిరిజన యువకుడు..? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఎందుకు పోటీ చేస్తున్నాడు..? ఆయన సేవలాల్ జయంతి రోజే ఎన్నికల ప్రచారం ఎందుకు ప్రారంభించాడు..? ఈ అంశాలపై పట్టబద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అవినాష్ జాదవ్ తో ఏబిపీ దేశం ఫేస్ టు ఫేస్.