Miyapur Issue Sensational Pressmeet | మియాపూర్ ఘటనపై డీసీపీ సంచలన ప్రెస్‌మీట్ | ABP Desam

హైదరాబాద్ లోని మియాపూర్‌, చందానగర్‌లో సైబరాబాద్ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఏకంగా వెయ్యి మంది పోలీసులను మోహరించి భారీ భద్రత ఏర్పాటు చేశారు. మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101 వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వందల ఎకరాల స్థలాన్ని కొంత మంది ఆక్రమణకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు భూమి చుట్టూ ఉన్న రోడ్ల వద్ద బారికెడ్లు ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని రానీయడం లేదు. సదరు భూమి 450 ఎకరాలు ఉంటుందని.. ఈ ప్రభుత్వ భూమి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉందని ఎస్టేట్ ఆఫీసర్ చెబుతున్నారు. కావాలని కొంతమంది వదంతులు సృష్టించి గుడిసెలు వేసుకోవచ్చని వాట్సప్ లలో పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆక్రమించడానికి ఒక వర్గానికి చెందిన ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ ల్యాండ్ మొత్తం గుట్టలతో అడవి లాగ ఉండడంతో ఇంకా కొంతమంది చెట్ల కింద బండరాయిలు కింద తలదాచుకున్నారు. అలాంటి వారిని గుర్తించి పోలీసులు బయటకు పంపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola