Minister Seethakka Receives Protocol Salute: నక్సలైట్ గా మొదలై, మంత్రిగా సెల్యూట్ అందుకునే దాకా..!
ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క అంటే పార్టీలకు అతీతంగా చాలా మంది అభిమానులు ఉంటారు. ఆమె వ్యక్తిత్వం, ఆమె ఎదిగిన తీరు, ఎక్కడ్నుంచి ఎక్కడిదాకా వచ్చారో అన్న జర్నీ చూస్తే చాలామందికి మర్యాద కలుగుతుంది. ఇప్పుడు మంత్రిగా పోలీసుల చేత ప్రోటోకాల్ సెల్యూట్ అందుకునే స్థాయిలో ఉన్నారు. అయితే ఈ సమయంలోనే సీతక్క గతాన్ని గుర్తుచేసుకుంటూనే ఆమె మీద సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.