Minister Errabelli Dayakar: జనగామ ఫీవర్ సర్వేలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణలో ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో నిండాలి. రాష్ట్రం మొత్తం ఆరోగ్య తెలంగాణ కావాలి. ఇదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జ్వర సర్వేలో భాగంగా ఈ రోజు మంత్రి జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం, పాలకుర్తి మండలం ఎల్లారాయని తొర్రూరు గ్రామాల్లో జ్వర సర్వేలో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి జ్వర సర్వే కార్యకర్తలతో మాట్లాడారు. సర్వే జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉందని అడిగారు. జ్వర సర్వే ప్రాధాన్యతను వివరించారు.