Meerpet Husband Killed Wife | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP Desam

 భార్యను నరికి ముక్కలు చేశాడు. ఆ శరీరభాగాలను కుక్కర్ లో వేసి ఉడకబెట్టాడు. ఆమె ఎముకలను రోట్లో వేసి పొడి చేశాడు. వినటానికి ఇంత దారుణంగా ఉన్న ఈ మర్డర్ ను చేయటానికి ముందు ఈ ప్రొసీజర్ అంతా ట్రయల్ రన్ కూడా చేశాడు. అందుకోసం ఓ కుక్కను చంపేశాడు. హైదరాబాద్ ను ఉలిక్కిపడేలా చేసిన ఈ కిరాతక హత్య మనిషి సైకోయిజానికి క్షణకాలపు ఆవేశానికి..అర్థం లేని తనానికి నిదర్శనం. అసలు ఎవరతను ఎందుకు ఇంత దారుణంగా భార్యను చంపేశాడు. ఈ వీడియోలో చూద్దాం.ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పుట్ట గురుమూర్తి . వయస్సు 39 సంవత్సరాలు. సొంతూరు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు. ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు. 13ఏళ్ల క్రితం తన గ్రామానికి చెందిన మాధవిని పెళ్లి చేసుుకన్నాడు. హ్యాపీ లైఫ్. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు పాప.బాబు. జనరల్ గా ఆర్మీలో రూల్ ప్రకారం 14ఏళ్లు దేశ సేవ చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా లో డీఆర్డీవో లో సెక్యురటీ గార్డ్ గా జాబ్ తెచ్చుకుని...రంగారెడ్డి జిల్లా  బాలాపూర్ మండలం జిల్లేలగూడలో నివాసం ఉంటున్నాడు. అయితే తన భార్యపై ఎందుకో అనుమానం వచ్చింది గురుమూర్తికి. వేధించటం అనుమానించటం మొదలుపెట్టాడు. తరచుగా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఆ గొడవలు పెరిగి పెద్దవి అవటంతో...తన భార్య 16వ తారీఖు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తన అత్తమామలకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు 18వరకూ చూసి అమ్మాయి రాకపోవటంతో మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ కుమార్తె కనిపించటం లేదని కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు అసలు దారుణం వెలుగులోకి వచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola