Meerpet Corporator భర్త వీరంగం.. కారుకు అడ్డంగా పార్క్ చేశాడని దాడి | ABP Desam
హైదరాబాద్ మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ విజయలక్ష్మి భర్త రాజు హల్ చల్ చేశారు. జనప్రియ మహానగర్ లో తన షాపు ముందు.. కారుకు అడ్డంగా వాహనాన్ని పార్క్ చేసినందుకు కృష్ణ అనే వ్యక్తిపై దాడికి దిగారు. అలా ఎలా పార్క్ చేస్తావంటూ కృష్ణ షాపులోకి దూసుకొచ్చి అసభ్య పదజాలంతో దూషించాడు. అతన్ని కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చాడు రాజు ముదిరాజ్. సీసీటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.