Medaram Sammakka Sarakka Fest : కాకతీయులతో యుద్ధంలో సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు చనిపోయారా? నిజమెంత?
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతర చారిత్రక నేపథ్యం, వారి పుట్టుక, మరణం చుట్టూ ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కోట్లాది మంది రెండేళ్లకోసారి తరలివచ్చి దర్శించుకుని, ఎత్తు బంగారాన్ని మొక్కులుగా చెల్లించుకునే ఈ వనదేవతలకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాల్లో నిజాలేంటో ఓసారి చూద్దాం.