Medaram | Phone Charging Business |సిగ్నల్ ఉన్నా లేకపోయినా ఫోన్ ఉండాల్సిందే, అందుకే ఈ బిజినెస్
Medaram | Phone Charging Business |
సెల్ ఫోన్... ఇప్పుడు మనిషి జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ఇక మేడారం జాతర అంటే... ములుగు జిల్లాలోని మేడారం అభయారణ్యంలో ఉన్న సమ్మక్క సారక్కల దర్శననానికి కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. కానీ అది అటవీ ప్రాంతం కావడంతో మొబైల్ నెట్ వర్క్ ఏమాత్రం ఉండదు. అయినా కానీ జనాలు తమ ఫోన్లను చేతిలో పట్టుకుని, ఏదో ఒకటి చూసుకుంటూ, ఆపరేట్ చేస్తూనే ఉంటున్నారు. సిగ్నల్ లేకపోయినా ఫోన్ వదిలి ఉండలేని పరిస్థితి. ఇక ఫోన్లకు చార్జింగ్ పెట్టాలంటే... అదంతా అడవి కదా.. అక్కడున్నవన్నీ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారాలే. వాటిలో కరెంట్ కనెక్షన్లు ఉండవు.. మరి ఎలా. ఈ ఆలోచనే కొందరికి ఇప్పుడు కాసులు కురిపిస్తోంది. వనదేవతల జాతరలో కొందరు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుచేశారు. ఈ పాయింట్ల వద్ద అన్ని రకాల మొబైల్ చార్జర్లు, కేబుల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ చార్జింగ్ సెంటర్ల కు ఎవరైనా రావచ్చు, తమ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇలా చార్జ్ చేసుకోవడానికి గంటకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు.