Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

Continues below advertisement

   ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. దశాబ్దాల క్రితం గిరిజనులకు మాత్రమే పరిమితమైన జాతర కాలక్రమేణా గిరిజనులతో పాటు గిరిజనేతరులు వనదేవతలను కొలుస్తున్నారు. వనదేవతలపై భక్తులకు అపారమైన నమ్మకం, విశ్వాసం. ఈ జాతర మేడారానికి ముందు మేడారం సమీపంలోని బయ్యక్కపేటలో జరిగేది. అక్కడి నుంచి మేడారం గద్దెలకు జాతర ఎందుకు మారింది. అసలు బయ్యక్కపేట జాతర చరిత్ర ఏంటి ఆ విశేషాలను తెలుసుకుందాం.

సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారంలో ఇప్పుడు జరుగుతున్న జాతర అనేక రూపాలు చెంది ప్రస్తుత స్థితికి చేరుకుంది. మొదట్లో సమ్మక్క జాతర మేడారంలో జరిగేది కాదు. 1940 తరువాత నుంచి వనదేవతల జాతర మేడారంలో జరుగుతుంది. అంతకు ముందు ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామంలో జరిగేది.1940 కు పూర్వం బయ్యక్కపేటలో చంద వంశస్తులు జాతరను నిర్వహించేవారు. బయ్యక్కపేట లో కరువు కాటకాలు రావడం, జాతరకు నీటి కొరతతో ఆదివాసీ గిరిజన తెగల ఒప్పందంతో జాతరను మేడారానికి మార్చారు. బయ్యక్కపేట ప్రాంతంలో ఉండే చంద వంశానికి చెందిన ఆదివాసి గిరిజనులకు సమ్మక్క అనే శిశువు దొరకడం జరిగింది. గిరిజనులు ప్రధానంగా అటవీ ఉత్పత్తులే జీవనాధారం కావడంతో వారు ఎల్లెరి గడ్డల కోసం అడవికి  వెళ్లిన క్రమంలో ఎల్లేరుగడ్డల కింద ఒక పెట్టెలో సమ్మక్క దొరికిందని చంద వంశస్తులు చెబుతున్నారు. సమ్మక్కను పెంచి పెద్ద చేసిన తరువాత యుక్త వయసుకు వచ్చిన సమ్మక్క మీ మద్యన ఉండలేను, నేను దేవత స్వరూపిణి అని చెప్పడంతో బయ్యక్కపేట కు సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న గట్టుకు పంపాలని చెప్పడంతో ఆదివాసీ గిరిజనులు సమ్మక్కను ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న సమ్మక్క గట్టుకు పంపారు. అదే సందర్భంలో వారికి నీటి వసతి కావాలని చెప్పడంతో సమ్మక్క కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం సమ్మక్క గుట్ట క్రింద గిరిజనులు ఒక బావిని త్రవించారు. ఆ బావి పేరే జలక బావిగా గిరిజనులు పిలుస్తున్నారు. ఇప్పటికీ జలుక బావి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ గిరిజనులు జలక బావి పవిత్రంగా చూస్తారు. చందావశాస్తులు, వారితో వెళ్ళినవారు తప్ప ఇతరులు అక్కడికి వెళ్ళడానికి సాహసించరు. అంతే కాదు బావి ప్రాంతానికి పవిత్రంగా వెళ్లడంతో పాటు చెప్పులు వేసుకొని వెళ్లారు. అంటే గిరిజనుల నమ్మకానికి, విశ్వసానికి ప్రతిరూపంగా చెప్పవచ్చు. సమ్మక్క ఎలా దొరికింది ఎలా పెరిగింది దేవత ఎలా ఉంది అనే విషయాలను చందా వంశస్థుడైన కిషన్ రావు చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola