
అగ్నిపమాదంలో ప్రాణాలు తీసిన తలుపులు
హైదరాబాద్ మణికొండ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పుప్పాలగూడలో షార్ట్ సర్క్కూట్ కారణంగా మంటలు వ్యాపించి, రెండు అంతస్దుల భవనం మొత్తం దట్టమైన పొగతో కమ్మేసింది. హైడ్రా బృందాలు మంటలు అదుపులోకి తెచ్చినప్పటికీ , మొదటి అంతస్దులో తలుపులు వేసుకోని లోపల చిక్కుకోవడం వల్ల ఒకే కుటుంబానకి చెందిన ముగ్గరు పొగపీల్చి ప్రాణాలు కోల్పారు.
హైదరాబాద్ మణికొండ సమీపంలో పుప్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో మొదట పార్కింగ్ లో ఉన్న రెండు కార్లు దగ్ధమైయ్యాయి. ఆ మంటలు పైకి వ్యాపించి, రెండంతస్తుల భవనాన్ని పూర్తిగా దట్టమైన పొగ కమ్మేసింది. పొగవ్యాపించంతో భయపడి మొదటి అంతస్దులో ఉంటున్న ముగ్గురు, ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసుకోవడంతో, పొగ పీల్చి ఊపిరాడక ప్రాణాలు కోల్పారు. డీఆర్ ఎఫ్ , హైడ్రా బృందాలు ఘటనా స్దలానికి వెళ్లి, వేగంగా సహాయక చర్యలు చేపట్టి ,మంటలను వేగంగా అదుపు చేసినప్పటికీ ,ఇంటి తలులుపు వేసుకోవడంతో అప్పటికే విపరీతంగా పొగ పీల్చడం వల్ల జమీల ఖాటున్(65), షహానా ఖాటన్(30) , షిర్జ(4)లు మృతిచెందినట్లు హైడ్రా రీజనల్ ఫైర్ ఆఫీసర్ జయప్రకాష్ తెలిపారు