Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్‌కౌంటర్ | ABP Desam
మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, PLGA దళపతి హిడ్మా హతమయ్యాడు.
పోలీస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న హిడ్మా అసలు పేరు మాడవి హిడ్మా. ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా ప్రాంతానికి చెందినవాడు. మాడవి హిడ్మా టీనేజ్‌లోనే మావోయిస్టు PLGAలో చేరాడు. PLGA 1st బెటాలియన్ కమాండర్‌గా ఎదిగాడు. అడవుల్లో అంబుష్ టాక్టిక్స్, గ్రౌండ్ ఇంటెలిజెన్స్‌లో ఎక్స్పర్ట్.
2010 దంతేవాడ ఎటాక్, 2013 కాంగ్రెస్ కాన్వాయ్ దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఈ దాడిలో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్, ఇతర నేతలు, భద్రతా సిబ్బంది సహా 30 మంది మృతి చెందారు. 2013 కాంగ్రెస్ కాన్వాయ్ దాడి మావోయిస్టులు చేపట్టిన అత్యంత పెద్ద రాజకీయ దాడుల్లో ఒకటి.
ఇదే కాకుండా బుర్కాపాల్ 2017, సుక్మా 2018 .. ఇలా వరుస దాడుల్లో కీలక రోల్ ప్లే చేసాడు. 2021 సిఆర్పిఎఫ్ జవాన్ల పై దాడి ఘటనల్లో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో హిడ్మా చాలా ఇంపార్టెంట్ పర్సన్. బస్తర్ డివిజన్ కు సంబందించిన అన్ని నిర్ణయాలు హిడ్మానే తీసుకునేవాడు. హిడ్మా అరుదుగా బయటకు వచ్చేవాడు. దాంతో తనను ట్రాక్ చేయడం పోలీసులకు కూడా చాలా కష్టంగా ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నా కూడా తృటిలో తప్పించుకున్నాడు కానీ.. పోలీసులకు చిక్కలేదు. ఎన్నో ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మాపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.
ఇవాళ పోలీసులు మారేడుమిల్లి టైగర్ జోన్ లో నిర్వహించిన దాడుల్లో హిడ్మా హతమైయ్యాడు. అయితే సర్రిగా వారం క్రితం ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ హిడ్మా పుట్టిన పూర్వర్తి గ్రామానికి వెళ్లారు. అక్కడ హిడ్మా తల్లితో సమావేశం అయ్యారు. "ఎక్కడున్నావు కొడుకా ? ఇంటికి వచ్చేయి అంటూ కొడుకుని వేడుకుంది హిడ్మా తల్లి. ఈ ఘటన జరిగిన వారానికే హిడ్మాను ఎన్కౌంటర్ చేసారు పోలీసులు.