నువ్వు అన్న ఏంట్రా.. ముసలోడివి! తాగి మనోజ్ రచ్చ!
మంచు ఫ్యామిలీలో గొడవలు కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తున్న తరుణంలో మంచ మనోజ్ కు సంబంధించిన మరో వీడియో ఒకటి బయటికి వచ్చింది. వారి కుటుంబ గొడవను ఎవరో వీడియో చేసి బయటకు లీక్ చేశారు. అయితే, ఇందులో మనోజ్ తీరును బట్టి ఆయన తాగి ఉన్నాడా అనేది సందేహాన్ని వ్యక్తం చే్తున్నారు. వరుసకు అన్న అయ్యే ఒక దగ్గరి బంధువుపై అరుస్తూ ఉండగా.. మోహన్ బాబు కంట్రోల్ చేస్తున్నట్టుగా వీడియోలో కనిపించింది. అయితే ఈ వీడియో ఎప్పుడు విడుదల అయిందనే విషయంపై స్పష్టత లేదు. ఇంటి లోపల వీడియోలు ఎవరు లీక్ చేస్తున్నారు.. అన్న విషయంపై కూడా అనుమానాలు ఉన్నాయి. మనోజ్ తాగుడుకు అలవాటు పడ్డాడని ఆడియ మెసేజ్ లో మోహన్ బాబు కూడా పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఇంట్లో వారిని కూడా మనోజ్ కొడుతున్నాడని మోహన్ బాబు ఆడియోలో చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచు మనోజ్ వీడియో బయటకు లీక్ కావడం చర్చనీయాంశం అయింది.