Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
మంచిర్యాల జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. హాజీపూర్ మండలం ముల్కల గ్రామంలో గోదావరి సమీపంలోని నేలమాలిగలో ఓ అమ్మవారి విగ్రహం వెలుగు చూసింది. అయితే ఇది కాదు వార్త. అసలు ఆ విగ్రహం నేలమాళిగల్లో ఉందంటూ గోదావరి యాత్ర కోసం వచ్చిన కొంత మంది పీఠాధిపతులు, స్వామీజీలు తెలిపారు. ఆ వార్త తెలుసుకున్న కొంతమంది భక్తులు వింత వింత గా ప్రవర్తించారు. నిమ్మకాయలు చేతపట్టుకుని నేలమీద పాకుతూ విగ్రహం ఎక్కడ దొరుకుతుందో చూపించారు. ఈ లోగా అక్కడకు చేరుకున్న స్వాములు పోలీసుల సాయంతో జేసీబీ తవ్వకాలు జరిపించగా...నేలపొరల్లో నుంచి ఓ దుర్గమ్మవారి విగ్రహం వెలుగు చూసింది. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో అమ్మవారు వెలవటం అదృష్టంగా భావిస్తున్నామంటూ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అతి త్వరలోనే ఊరి ప్రజలంతా దేవలయాన్ని నిర్మించుకుంటామని చెబుతున్నారు. విజయవాడ దుర్గ గుడి స్థాయిలో తమ ఊరి ప్రాభవం పెరగనుందని స్వామిజీలు ఆశీర్వదించిన వెళ్లారంటూ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.