Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

హైదరాబాద్ శివారు బండ్లగూడలోని మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. సేవ్ ది మధుపార్క్ రిడ్జ్ అనే నినాదంతో నిరసనలు చేపట్టారు. మధ్యతరగతి ప్రజలు జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న ఇళ్లను ప్రభుత్వం మొండిగా కూల్చాలని చూడటం అమానుషమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను ప్రస్తావించి,  ఇండ్లను కూల్చకుండా ఆపాలంటూ ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. అసలు గాంధీ సరోవర్ నిర్మాణ పరిధిలోకి మధు పార్క్ రిడ్జ్ రాదని, కేవలం సుందరీకరణ పేరుతో వేలాది మందిని రోడ్డున పడేయడం సమంజసం కాదని నివాసితులు వాదిస్తున్నారు.ప్రభుత్వం దిగొచ్చి ఇండ్లను కూల్చేందుకు ఇచ్చిన నోటీఫికేషన్ వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. మధుపార్క్ విషయంలో ప్రభుత్వం ఎందుకు అంత మొండిగా ముందుకెళ్తోంది. గాంధీ సరోవర్ నిర్మాణం పరిధిలోకి రాని మధుపార్క్ ను కూల్చి ప్రభుత్వం ఏం చేయబోతోంది. వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిసినా రేవంత్ సర్కార్ దూకుడుకు కారణాలేంటి. మధుపార్క్ ను ఎందుకు కూల్చాలి. ABP దేశం గ్రౌండ్ రిపోర్ట్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola