Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP Desam
మహబూబా బాద్‌లో ఓ గణపతి మండపానికి వచ్చే భక్తులను కోతులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అక్కడికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ సమస్యని తప్పించేందుకు నిర్వాహకులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. కోతులు మళ్లీ అటువైపు రాకుండా కొండముచ్చుని తెప్పించారు. మండపం వద్దే దాన్ని కట్టేశారు. కేసముద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న మండపంలో ఇలా కొండెంగ అటూ ఇటూ తిరుగుతూ కోతులు రాకుండా కాపలా కాస్తోంది. ఇప్పుడు కోతుల బెడద తప్పిందని, భక్తులు ప్రశాంతంగా వచ్చి గణనాథుడిని దర్శించుకుని వెళ్తున్నారని నిర్వాహకులు వెల్లడించారు. కోతులతో ఇన్నాళ్లూ ఇబ్బందులు పడిన భక్తులకు ఇలా కొెెండెంగ ను తీసుకువచ్చి బాధ తప్పించటంపై నా వాళ్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు ఇదే విధానం కొనసాగించాలని అందునా కోతుల వల్ల ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఇక పై సమస్యలు తీరినట్లేనని చెబుతున్నారు. ఫలితంగా ఆలయాని కి వచ్చే భక్తుల సంఖ్య నూ పెరుగుతోందని చెబుతున్నారు.