Kukatpally Sahasra Child Murder Case | కూకట్ పల్లి బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్ట్ | ABP Desam

 సంచలనంగా మారిన కూకట్ పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. నాలుగురోజుల తర్వాత నిందితుడు ఎవరో గుర్తించిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. పాపను హత్య చేసింది పదోతరగతి చదువుతున్న పక్కింటి బాలుడని తేలేసరికి అంతా విస్తుపోయారు. నాలుగురోజుల క్రితం ఇంట్లో తల్లితండ్రులు లేని సమయంలో సహస్ర ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన పదిహేనేళ్ల బాలుడు..ఇంట్లో నుంచి 80వేల రూపాయలు కాజేశాడు. తిరిగి వెళ్తూ వెళ్తూ తనను పదేళ్ల సహస్ర చూడటంతో గొంతు నులిమి చంపేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బతకకూడదనే ఉద్దేశంతో కత్తితో విచక్షణా రహితంగా పోట్లు పొడిచాడు. అయితే పోలీసులు హత్య కోణం ఎంక్వైరీ చేసి పాప తండ్రిని కూడా అనుమానించారు. కానీ దొంగతనం కోణంలోనూ విచారణ చేపట్టిన పోలీసులకు పక్కింటి పిల్లాడు రాసుకున్న ఈ లెటర్ దొరికింది. దొంగతనం ఎలా చేయాలి. తర్వాత ఇంట్లో వంట గ్యాస్ లీక్ చేసి ఎలా వచ్చేయాలని మొత్తం వివరంగా ఇంగ్లీష్ లో వివరంగా రాసుకున్నాడు. ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలో కూడా రాసుకున్న బాలుడు..ఈ క్రమంలో సహస్ర తనను చూడటంతో విచక్షణారహితంగా చంపేశాడు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola