KTR tours Flood effected Siricilla | మా ఆయన కళ్ల ముందే కొట్టుకుపోయాడు | ABP Desam

వరద ప్రభావిత సిరిసిల్లలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎదుట తన భర్త కనిపించకుండా పోయాడంటూ ఓ భార్య కన్నీమున్నీరైంది. తన భర్త వరద ఉధృతిలో కొట్టుకుపోయాడని.. ఆయనని వెతికి అప్పగించాలంటూ కేటీఆర్ కాళ్లపై పడి తన గోడు వెళ్ల బోసుకుందామె. ఆమెతో పాటు ఆమె కొడుకు, కూతురు కూడా తమ తండ్రిని కనిపెట్టాలంటూ కేటీఆర్‌ ముందు భోరున విలపించారు. వారందరినీ ఓదార్చిన కేటీఆర్.. ధైర్యంగా ఉండాలని, వరదల్లో చిక్కుకున్న చాలామంది చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకున్నారని, ఆయన కూడా త్వరలో తిరిగొస్తారంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. వరద పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. వర్షాలు, వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని.. ప్రాణ నష్టం జరిగితే 25 లక్షలు, పంట నష్టం జరిగితే ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వడంతో పాటు ఇళ్లు పోగొట్టుకున్న బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరపున అన్ని విధాలుగా పోరాడతామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola