ABP News

చంద్రబాబుతోనే పోరాటం చేశాం, నువ్వెంత రేవంత్ - కేటీఆర్ ఆగ్రహం

Continues below advertisement

బీఆర్‌ఎస్ సీనియర్ నేత కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ తరవాత ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతోందని మండి పడ్డారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. సీఎం స్వయంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకుని మరీ కండువాలు కప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసిందే కౌశిక్ రెడ్డి అని వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అన్న రేవంత్..ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో తెలంగాలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. చేతకాని ముఖ్యమంత్రి అంటూ రేవంత్‌ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హామీలు నెరవేర్చేంత వరకూ కాంగ్రెస్‌ని వెంటాడతామని తేల్చి చెప్పారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram