KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”

Continues below advertisement

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి రోజుల్లో సాధించింది అరెస్టులు, అక్రమ నిర్బంధాలు మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు.

హామీలు అమలు చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. “మేము సిద్ధం.. మీరు సిద్ధమా?” అంటూ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు.

మహిళల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉంటే.. నిన్న తమ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

హైకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కావాలనే తాతా మధు, నవీన్ రెడ్డిలపై ఫేక్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారం ద్వారా ప్రభుత్వానికి కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతోందని విమర్శించారు.

ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్‌ను గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీల అరెస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola