
KTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam
ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి నేరుగా బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు కేటీఆర్. అప్పటికే ఈడీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుని ఉన్నారు. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈడీ ఆఫీసుకు భారీగా చేరుకోవటంతో కేటీఆర్ ఆఫీసులోపలికి పంపించటం పోలీసులు బాగా కష్టమైంది. ఇప్పటికే ఇదే కేసులో ఏసీబీ విచారణకు ఓ ాసారి హాజరైన కేటీఆర్...ఇప్పుడు ఈడీ ఎంక్వైరీని ఎదుర్కోనున్నారు. 2023లో ఫార్మూలా ఈ కార్ రేసు ను హైదరాబాద్ లో కొనసాగించేందుకు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి 55కోట్ల రూపాయలకు విదేశీ సంస్థకు మళ్లించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. డబ్బులు విదేశీ సంస్థకు పంపటానికి ముందు కేటీఆర్ కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అభియోగాలు మోపారు. తనపై ఏసీబీ, ఈడీ పెట్టిన కేసులను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టు, సుప్రీంకోర్టు కు వెళ్లినా అవి సత్ఫలితాలను ఇవ్వకపోవటంతో కేటీఆర్ ఈడీ విచారణకు నేడు హాజరయ్యారు.