KTR About Opposition Parties Meeting: భేటీకి ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పేసిన కేటీఆర్
విపక్షాల ఐక్యత నినాదంతో ఇవాళ... పాట్నాలోని దేశంలోని అన్ని ప్రముఖ పార్టీలు సమావేశమయ్యాయి కదా. ఆ భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క పార్టీ కూడా హాజరవలేదు. టీడీపీ, వైసీపీ సంగతి పక్కన పెడితే.... జాతీయ రాజకీయాల గురించి బాగా వోకల్ గా ఉన్న కేసీఆర్..... ఆయన హాజరవడమో లేక ప్రతినిధిని పంపడమో ఎందుకు చేయలేదు అని చాలా చర్చ నడిచింది. ఇప్పుడు కేటీఆర్ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ తో ఒక్క విషయం మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తోంది. కాంగ్రెస్ ఉన్న కూటమికి బీఆర్ఎస్ దూరంగా ఉంటోందని.