KTR about Kaleshwaram NDSA Report | కాళేశ్వరం ప్రాజెక్ట్ NDSA రిపోర్ట్ పై కేటీఆర్

మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెలే కేటీఆర్ కూడా పాల్గొన్నారు. SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. ఇప్పటికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్య మంత్రి  రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని మండిపడ్డారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై కన్నీళ్ళు  తుడిసిన మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ మీద అభాండాలు వేస్తున్నారు అని మండిపడ్డారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం వాడకుండానే పంట పంట పండింది అనేది పూర్తిగా అవాస్తవం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పండిన పంట అంత కాళేశ్వరం నీళ్లతోనే పండింది అని అన్నారు మాజీ మంత్రి  హరీష్ రావు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిన వెంటనే ఆఘమేఘాల మీద NDSA వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముందు చివరి నివేదిక ఇచ్చింది అని అన్నారు హరీష్ రావు 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola